నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
NLR: పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు పోలీసుల ఎదుట లొంగిపోగా... వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని గురువారం సాయంత్రం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన సోదరుడు ఉన్నారు.