సామూహిక వివాహాలు.. ఒక్కటైన 54 జంటలు

సామూహిక వివాహాలు.. ఒక్కటైన 54 జంటలు

ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్‌ల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ ఖాన్ యూనస్‌లో సామూహిక వివాహాలతో వేదికలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో 54 జంటలు ఒక్కటయ్యాయి. యూఏఈ మద్దతు ఉన్న అల్ ఫారెస్ అల్ షాహిమ్ ఇందుకు నిధులు సమకూర్చడంతో పాటు కొత్త జంటలకు కొంత డబ్బు, ఇతర సామాగ్రిని కూడా అందించారు.