మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
కృష్ణా: మచిలీపట్నం మండలంలోని కానూరు, తాళ్లపాలెం గ్రామాలలో మత్స్యకార కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొంథా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె అందజేశారు. తుఫాను సమయంలో తీసుకున్న ప్రభుత్వ చర్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మత్స్యకారులను ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.