నాటుసారా ప్రమాదాలపై ఎక్సైజ్ శాఖ అవగాహన

ELR: టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో గురువారం ఎక్సైజ్ అధికారులు అవగాహన కార్యక్రమం చేశారు. గ్రామస్థులకు నాటుసార తయారీ, విక్రయం, రవాణా, వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక నష్టాలను వివరించారు. మద్యపానం గ్రామాభివృద్ధికి అడ్డంకి అవుతుందని, సారాయిని పూర్తిగా గ్రామం నుంచి తరిమివేయాలని సూచించారు.