పల్లె నిద్రలో పలు అంశాలపై అవగాహన కల్పించిన సీఐ
VZM: బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ సోమవారం రాత్రి తెర్లాం మండలం పెరుమాళిలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించి మాదకద్రవ్యాలు వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని, వాటికీ దూరంగా ఉండాలని యువతను కోరారు. పొక్సో చట్టం, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.