ప్రైవేట్ బస్సులో భారీగా ఎగిసిపడిన మంటలు

హైదరాబాద్ - షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే దారిలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.