బంగారం అపహరించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!
W.G: భీమవరం బస్టాండ్‌లో ఈ నెల 17న జరిగిన బంగారం ఆభరణాల చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. నిందితులు కుమార్, సుభాష్‌లను అరెస్టు చేసినట్లు SP అద్నాన్ నయీం అస్మి మీడియాకు తెలిపారు. సీఐ నాగరాజు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, ఆంజనేయ ప్రసాద్ నుంచి అపహరించిన బంగారాన్ని రికవరీ చేశారని తెలిపారు. ఎస్పీ సిబ్బందిని అభినందించారు.