సీఎస్ పురం: వైసీపీలో చేరిన జనసేన నాయకుడు

ప్రకాశం: సీయస్ పురం మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గారి సమక్షంలో జనసేన నాయకుడు సంగిశెట్టి వెంకీ శనివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వెంకీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.