రైలు కిందపడి యువతీ, యువకుడి మృతి

రైలు కిందపడి యువతీ, యువకుడి మృతి

బాపట్ల: చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై మంగళవారం ఓ యువతి, యువకుడు రైలు ఢీకొని మృతి చెందారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై కొండయ్య, ఏఎస్ఐ శ్రీనివాసరావు మృత దేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.