అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

KNR: దుర్షేడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. వారందరికీ రోజువారీగా అందించే భోజనాన్ని స్వయంగా వడ్డించారు. సిలబస్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు ఎత్తు కొలవాలని అన్నారు.