జైనులతో సమావేశమైన మంత్రి
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని జైన్ మందిరాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జైనులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జైనుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.