VIDEO: మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్
HYDలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో గల నోబుల్ టాకీస్ చౌరస్తా వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ గొడవలకు దిగడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.