'అక్రిడిటేషన్ కార్డులపై దుష్ప్రచారం నమ్మవద్దు'
BHPL: అక్రిడిటేషన్ కార్డుల జారీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టీయూడబ్ల్యూజే BHPL జిల్లా నేతలు క్యాతం సతీశ్, శ్యామ్ స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. జీవో 252 ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ కార్డులు అందుతాయని, సంఖ్యను కుదిస్తారనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు తదితరులు ఉన్నారు.