VIDEO: యువతను ఆలోచింపజేసిన ఏసీపీ ప్రసంగం
WGL: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి అంతిమయాత్రలో వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. జీవితం ఒక్కసారే వస్తుందని, మద్యం-గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాలకు ప్రేరేపించే స్నేహాలను వదులుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.