ఇప్పటికీ బంతి ఇరాన్ కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్
ఇప్పటికీ బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇరాన్ స్పందన కోసం అమెరికా ఎదురు చూస్తుందని చెప్పారు. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు వరకు ఎదురుచూస్తామని వెల్లడించారు. తమ లక్ష్యం హర్మూజ్ నుంచి స్పేచ్చేగా చమురు, ఎల్పీజీ నౌకలు వెళ్లాలని పేర్కొన్నారు. ఇరాన్ అలా చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.