'డెంగ్యూ కేసుల పట్ల జాగ్రత్త వహించాలి'

మేడ్చల్: ఉప్పల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ నెలలో రెండు, జూలై నెలలో 6 డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా డాక్టర్లు రిపోర్టు విడుదల చేశారు. ఈ ఏడాది నగరంలో లోటు వర్షపాతం నమోదు కావడం, మరోవైపు ప్రజల్లో అవగాహన పెరగడంతో కేసులు గతంతో పోలిస్తే తగ్గాయియన్నారు. అయినప్పటికీ, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో డెంగ్యూ కేసులో అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయని, జాగ్రత్త వహించాలన్నారు.