VIDEO: 'నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు పునరుద్దరించాలి'
ప్రకాశం: కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం భావన నిర్మాణ రంగ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశవరావు ప్రసంగించారు. భవన నిర్మాణ రంగ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను కార్మికులకు అమలు చేసి, బీమా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు.