VIDEO: 'ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి'
ASF: ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు ఆరోపించారు. గురువారం జైనూర్ మండలం పాడిబండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఎండలు మండుతున్న వేళ పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.