ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు
MBNR: ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఒక యువతితో ప్రేమ బంధం కొనసాగించి, వివాహం చేసుకోవాలని యువతి కోరగా నిరాకరించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకాంత్‌పై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహానికి నిరాకరించిన యువకుడిపై ఈ చర్యలు తీసుకున్నారు.