డిప్యూటీ సీఎం కోసం ఎమ్మెల్యే పూజలు
కృష్ణా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు చేశారు. సోమవారం చల్లపల్లిలోని శ్రీ అభయ ఆంజనేయ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. సైనస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చేయాలని కోరారు.