మరోసారి NDAను గెలిపించండి: లోకేష్
AP: బీహార్ అభివృద్ధి కోసం మరోసారి NDA కూటమిని గెలిపించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ వెళ్లిన ఆయన.. పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు. 'బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో అత్యధికంగా బీహార్‌కు నిధులు కేటాయించారు' అని పేర్కొన్నారు.