గణనాథుడిని దర్శించుకున్న మెట్టు గోవిందరెడ్డి

ATP: రాయదుర్గం పట్టణంలోని సర్కిల్ వద్ద కొలువు తీరిన గణనాథుడిన్ని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల పిలుపు మేరకు బుధవారం సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.