హత్య కేసులో నిందితుడి అరెస్ట్
NTR: రెండు రోజుల క్రితం జగ్గయ్యపేటలో కలకలం సృష్టించిన హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో సాయి పోలీసులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం అందడంతో పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.