విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హనుమకొండ విద్యుత్తు సర్కిల్ పరిధిలో 2 ఉద్యోగులుకు సస్పెండ్ అయ్యారు. 2 రోజుల క్రితం యాదవనగర్‌లో విద్యుత్ కార్మికుడు పున్నం చందర్ విద్యుత్ ప్రమాదంతో మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు లైన్ ఇన్ స్పెక్టర్, లైన్‌మెన్ LC సమయంలో భద్రత చర్యలు తీసుకోలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ హనుమకొండ DE. జి. సాంబరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.