హిజ్రాను ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడు

ఓ యువకుడు హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లాకు చెందిన శరవణకుమార్(32) బట్టల తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. తనతో పని చేస్తున్న హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీనికి ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు న్యాయవాది మునియప్పన్ నేతృత్వం వహించారు.