VIDEO: క్యాన్సర్‌ బాధితుడికి అండగా నిలిచిన లోకేష్

VIDEO: క్యాన్సర్‌ బాధితుడికి అండగా నిలిచిన లోకేష్

ATP: చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 12 ఏళ్ల కె. చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్‌కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్‌కు చెందిన బాలుడికి బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేశారు.