నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

RR: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అభ్యర్థి సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పెద్దతుప్ర గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు.