పైరసీకి గురైన హిట్ మూవీ

మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి తెరకెక్కించిన సినిమా 'తుడరుమ్'. ఇటీవల రిలీజైన ఈ సినిమా పైరసీకి గురైంది. ఓ టూరిస్ట్ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై స్పందించిన ఆ మూవీ నిర్మాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ సినిమా ఇప్పటివరకు రూ.150 కోట్లు వసూలు చేసింది.