ప్రారంభానికి నోచుకోని చేర్యాల షాపింగ్ కాంప్లెక్స్

ప్రారంభానికి నోచుకోని చేర్యాల షాపింగ్ కాంప్లెక్స్

SDPT: చేర్యాల మార్కెట్ యార్డ్‌లో నిర్మించిన కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే 27 షట్టర్ల నిర్మాణం పూర్తయినా ఫ్లోరింగ్, విద్యుత్ పనుల సాకుతో ఏళ్ల తరబడి మూలన పడ్డాయి. దీంతో ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం నష్టం వాటిల్లుతోంది. స్థానిక వ్యాపారులు, రైతులు ఈ కొత్త దుకాణాల కోసం ఎదురుచూస్తున్నారు.