తెడ్డుపాడు వద్ద కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు

NLR: దుత్తలూరు మండల పరిధిలోని తెడ్డుపాడు హైవే సమీపంలో కారు అదుపుతప్పి గురువారం ఉదయం కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కలిగిరి మండలం పడమటి గుడ్లదొన గ్రామానికి చెందిన ముల్లంగి హరిగా గుర్తించారు. మార్కాపురం నుంచి కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.