కొత్త జిల్లాలపై అధ్యయనానికి ప్రభుత్వం కసరత్తు

కొత్త జిల్లాలపై అధ్యయనానికి ప్రభుత్వం కసరత్తు

AP: కొత్త జిల్లాలపై అధ్యయనానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు, సర్దుబాట్లపై కమిటీ అధ్యయనం చేయనుంది. గందరగోళాన్ని నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.