మోతీ ఖానాపూర్ పోలింగ్ కేంద్రం సందర్శన
MBNR: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బాలానగర్ మండలం మోతీ ఖానాపూర్లోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి బుధవారం సందర్శించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లెక్కింపు నిర్వహించాలని సూచించారు.