మాసాయిపేటకు 12 పోస్టులు మంజూరు

మాసాయిపేటకు 12 పోస్టులు మంజూరు

MDK: నూతనంగా ఏర్పాటైన మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయానికి 12 పోస్టులు మంజూరు చేస్తూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, సర్వేయర్, ఏఎస్‌వో, ఇద్దరు సబార్డినేట్లు (అటెండర్లు) పోస్టులు మంజూరయ్యాయి.