VIDEO: సముద్ర గర్భంలో జాతీయ జెండా రెపరెపలు
VSP: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుషికొండ ఐటీ జంక్షన్ సమీపంలోని సముద్రంలో డైవ్ అడ్డా ఆధ్వర్యంలో సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగరవేశారు. డైవ్ అడ్డా సీఈవో భద్రం రామిశెట్టి మాట్లాడుతూ.. సుమారు 15 అడుగుల లోతులో డైవ్ మాస్టర్లు, స్కూబా డైవర్స్ దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు. ఏటా గణతంత్రవేడుకల సందర్భంగా సముద్ర గర్భంలో జెండా ఎగురవేస్తున్నామన్నారు.