నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేయాలి

నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేయాలి

SKLM: ఓటర్ల జాబితాను నిబంధనలకు అనుగుణంగా కచ్చితత్వంతో తయారు చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి కె. సాయి ప్రత్యూష సూచించారు. మంగళవారం శ్రీకాకుళంలోని జెడ్పీ మందిరంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి అధికారులతో సదస్సు నిర్వహించారు. మరణించినవారి ఓట్లు, వివాహం జరిగినవారి ఓట్లు, రెండుసార్లు నమోదైన ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు.