తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ ప్రదర్శన

W.G: సీపీఐ జిల్లా మహాసభలు మంగళవారం తణుకులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆధ్వర్యంలో స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రాష్ట్రపతి రోడ్డు మీదుగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ రోటరీ క్లబ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.