ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌.. విజయవాడలో సంబరాలు

ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌.. విజయవాడలో సంబరాలు

AP: ఉపరాష్ట్రపతిగా NDA అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నికవ్వడంపై రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి.. పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ను గెలిపించినందుకు ఎంపీలకు MLA సుజనా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఎంపీలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.