ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

కర్నూల్ జిల్లా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఏ. సిరి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డు, మేల్ ఓపీ, క్రిటికల్ ఎమర్జెన్సీ వార్డు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూ డయాగ్నొస్టిక్ బ్లాక్‌లను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడమే ఈ తనిఖీ ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.