బంగారుపాళ్యంలో వివాహిత ఆత్మహత్య
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తగ్గువారి పల్లి కాలనీలో నివసిస్తున్న సుమతి (30) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో గది వేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో భాగంగా భర్త రవికుమార్‌తో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుందని పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.