ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కృష్ణా: విద్యతోనే నిరుపేదల అభ్యున్నతి సాధ్యమని ఉద్భోధించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని దివంగత జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘంటసాల మండలం పాపవినాశనంలో ఘనంగా జరిగాయి. జగ్జీవన్ రామ్ విగ్రహానికి వెంకట్రామ్ పూలమాలతో నివాళులర్పించారు. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు పాల్గొన్నారు.