పుణ్యగిరి శివరాత్రి హుండీ ఆదాయం ఎంతంతే..?
VZM: శృంగవరపుకోటలోని పుణ్యగిరి దేవాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర హుండీ ఆదాయం రూ.7,85,086గా నమోదైంది. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వైవీ రమణి, ఆలయ ఈవో నాగేంద్ర, ఉత్సవ కమిటీ చైర్మన్ పెదగాడ అప్పలరాజుల సమక్షంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తుల విరాళాలతో ఆలయానికి మంచి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.