అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

NLR: రూరల్ మండలం పొట్టేపాళెంలో కూల్ డ్రింక్ దుకాణం నడుపుతున్న నానం రమేష్ (45) అప్పుల బాధ, రుణదాతల ఒత్తిళ్లు తట్టుకోలేక కనిగిరి రిజర్వాయర్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఎస్సై సంతోష్ రెడ్డి వివరాల ప్రకారం, రమేష్ పెద్దూరుకు చెందినవాడని, వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయాడని తెలిపారు.