పొన్నూరులో ఏపీటీఎఫ్ సభ్యుల ర్యాలీ

GNTR: విద్యారంగంలో ప్రభుత్వ నైతికేతర విధానాలకు నిరసనగా సోమవారం పొన్నూరులో ఏపీటీఎఫ్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల్లో నినాదాలతో ప్రదర్శన నిర్వహించిన వారు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగించారు. అనంతరం తహశీల్దార్ మహమ్మద్ జియా ఉల్ హక్‌కు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని, విద్యా విధానాలను పునరాలోచించాలని కోరారు.