బీబీపేట్ PHCలో ఘనంగా వందేమాతరం గీతాలాపన
KMR: బీబీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వందేమాతరం గీతానికి 150 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున గీతాలాపన ఘనంగా నిర్వహించారు. బీబీపేట్ మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలో గీతాలాపన అనంతరం మాట్లాడుతూ.. ఈ దేశభక్తి గీతం దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.