'పర్యాటక కేంద్రంగా అనంతగిరి అభివృద్ధి'

'పర్యాటక కేంద్రంగా అనంతగిరి అభివృద్ధి'

VKB: అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరిత రిసార్ట్‌ను కలెక్టర్‌కు అప్పగించామని, ప్రైవేట్ రిసార్ట్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలన్నారు.