రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
BDK: పాల్వంచ మండలం నాగారం స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం ఇవాళ జరిగినట్లు స్థానికులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు మొక్కజొన్న కంకుల కోసం కారు డోర్ ఓపెన్ చేయగా ద్విచక్ర వాహనదారులు డోర్ తగిలి రోడ్డుపై పడ్డారు. దాంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి బంజర గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డిగా గుర్తించారు.