సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ELR: దెందులూరు మండలం గోపన్నపాలెంలో ఈనెల 25న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన విజయవంతానికి వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక విధులను కేటాయించినట్లు ఆమె తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, పర్యటన ముగిసేవరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.