యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
MNCL: హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్ అనే యువకుడు అదృశ్యంపై కేసు నమోదైంది. ఈ నెల 10న రాత్రి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోగా.. మూడు రోజులుగా వెతికినా ఆచూకీ లభించలేదని సోదరుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.