VIDEO: కేజీబీవీలో వాచ్ ఉమెన్ ఆత్మహత్యాయత్నం

VIDEO: కేజీబీవీలో వాచ్ ఉమెన్ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య:  సిద్ధవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న వాచ్ ఉమెన్ జయంతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కలిచర్లకు చెందిన ఆమె ఆంగళ్లు చేనేత నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రిన్సిపల్, ఎంఈఓ-2 వేధింపుల వల్లే ఈ చర్యకు దిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో ఉద్యోగం కోల్పోయి, జీతం నిలిపివేయడంతో మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.