ఇరుముడి పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే తోట

KMR: మద్నూర్ మండల కేంద్రం నుండి శబరిమల యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాముల ఇరుముడి పూజా మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప మాల చేబట్టి శబరిమలై వెళ్తున్న అయ్యప్ప స్వాములను అభినందించారు.